కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉంటుందని పాక్ మజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ అన్నాడు. ఓ చాట్‌షోలో పాల్గొన్న అక్తర్ పలు విషయాలు పంచుకున్నాడు. ‘నేను దాదాపు ఇండియా మొత్తం తిరిగాను. భారత్ ఒక అద్భుతమైన దేశం. అక్కడి ప్రజలను చాలా దగ్గరి నుంచి చూశాను. భారతీయులు చాలా మంచివాళ్లు. ఎల్లప్పుడూ పాకిస్థాన్‌ను స్వాగతిస్తూనే ఉంటారు. పాక్‌తో కలిసి పని చేయడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉంటారు. యుద్ధాన్ని అసలే కోరుకోరు. కానీ, టీవీల్లో చూసినప్పుడు మాత్రం రెండు దేశాల మధ్య రేపే యుద్ధం జరుగుతుందన్నట్లు అనిపిస్తుంది. భారత్ పురోగతి పాకిస్థాన్‌తో ముడిపడి ఉందని నా నమ్మకం’ అని అక్తర్ పేర్కొన్నాడు.
కరోనా వైరస్ గురించి మాట్లాడుతూ.. కరోనా వల్ల భారత్‌లో ఐపీఎల్ రద్దయితే ఇండియా భారీ నష్టం చవిచూడాల్సి వస్తుందని అక్తర్ అన్నాడు. ‘ప్రపంచ దేశాల్లో కరోనా వ్యాపించడం దురదృష్టకరం. దాని ప్రభావంతో పీఎస్ఎల్ (పాకిస్థాన్ ప్రిమియర్ లీగ్) కుదించాల్సి వచ్చింది. ఐపీఎల్ అయితే ఏకంగా రద్దు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. పీఎస్‌ఎల్ వల్ల పాకిస్థాన్‌కు క్రికెట్ తిరిగి వచ్చింది’ అని అన్నాడు. కరోనా విషయంలో చైనా దేశస్థుల ఆహారపు అలవాట్లపై అక్తర్ అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.