న్యూఢిల్లీ : మూడు బుల్లెట్లతో అక్తర్ ఖాన్ అనే వ్యక్తి గురువారం పార్లమెంట్ ఆవరణలోకి ప్రవేశించడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. దీంతో అలర్ట్ అయిన భద్రతా బలగాలు ఆయనను అదుపులోకి తీసుకుని విచారించాయి. అయితే దీనిపై పోలీసులు వివరణ ఇచ్చారు. ఖాన్‌కు లైసెన్స్ ఉన్న తుపాకీ ఉందని, అయితే ఆయన పొరపాటున బుల్లెట్లు తీయకుండానే ఆవరణలోకి ప్రవేశించినట్లు తమ విచారణలో తేలిందని స్పష్టం చేశారు. ఆయనను నిర్బంధంలోకి తీసుకోవడం తమ పొరపాటేనని, విచారణ పూర్తైన తర్వాత ఎలాంటి పొరపాటు లేదని తెలుసుకొని ఆయనను విడుదల చేశామని తెలిపారు. పార్లమెంటులోకి ప్రవేశించే ముందు తన జేబులో బుల్లెట్లు ఉన్నాయన్న విషయాన్ని తాను గమనించలేదని, పొరపాటున ప్రవేశించానని విచారణలో ఢిల్లీ పోలీసులకు ఆయన స్పష్టం చేసినట్లు సమాచారం.