కరోనా వైరస్ తీవ్రత దృష్ట్యా ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక ఎన్నికల ప్రక్రియను వాయిదా వేసిన విషయం తెలిసిందే. అయితే, ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఒకింత అసహనానికి గురయ్యారు. ఇదే అంశంపై గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌ను కలిసి అసంతృప్తిని వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం మీడియాతో మాట్లాడుతూ.. కరోనా వైరస్‌పై తీవ్రంగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. కేవలం 60 ఏళ్లు పైబడిన వాళ్లు, డయాబెటిక్, బీపీ, కిడ్నీ, లివర్ సంబంధిత వ్యాధులు ఉన్నవారికి వస్తే ఇది హానికరమైన వ్యాధిగా పరిగణించాలని చెప్పారు. అయితే ఎవరికీ ఎలాంటి ఇబ్బందీ ఉండకూడదని ముందు జాగ్రత్త చర్యగా ప్రభుత్వం తరఫున చర్యలు చేపట్టామని తెలిపారు. కరోనా అనుమానిత లక్షణాలు కనిపించిన వెంటనే తగిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
స్థానిక సంస్థల ఎన్నికల వాయిదా.. సీఈఓ రమేశ్ కుమార్‌పై జగన్ సంచలన వ్యాఖ్యలు