ఉచితంగా గ్యాస్ సిలిండర్..

మోదీ సర్కార్ తాజాగా దేశ ప్రజలకు శుభవార్త అందించింది. ఉచితంగా గ్యాస్ సిలిండర్ అందిస్తున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా కొంత మందికి రూ.1,000 నుంచి రూ.1,500 వరకు డబ్బులు కూడా ఆఫర్ చేస్తోంది.


కరోనా వైరస్ కారణంగా నెలకొన్న లాక్‌డౌన్ పరిస్థితుల నుంచి ఆర్థిక వ్యవస్థను గట్టెక్కించడానికి కేంద్ర ప్రభుత్వం రూ.1.7 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకేజీ ప్రకటించింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దీంతో చాలా మందికి ప్రయోజనం కలుగనుంది.


ఉజ్వల స్కీమ్ కింద బీపీఎల్ కుటుంబాలకు వచ్చే మూడు నెలలపాటు ఉచిత గ్యాస్ అందిస్తామని నిర్మలమ్మ ప్రకటించారు. అంతేకాకుండా పేద సీనియర్ సిటిజన్స్, వికలాంగులు, వితంతువులకు నగదు బదిలీ ప్రయోజనాన్ని అందిస్తామని తెలిపారు. వీరికి రూ.1,000 అందజేస్తామని పేర్కొన్నారు. వచ్చే మూడు నెలల కాలంలో రెండు ఇన్‌స్టాల్‌మెంట్లలో ఈ డబ్బులు అందజేస్తామని తెలిపారు. అంతేకాకుండా స్వయం సహాయక గ్రూప్స్‌కు రూ.20 లక్షల వరకు తనఖా లేని రుణాలు అందిస్తామని పేర్కొన్నారు.