అమ్మాయిల జట్టుకు సచిన్ సలహా
ముంబై: ఒత్తిడిని దరిచేరనీయకుండా ఆత్మవిశ్వాసంతో ఫైన ల్ మ్యాచ్ ఆడాలని బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ భారత మహిళల జట్టుకు సూచించాడు. ‘స్వేచ్ఛగా ఆడి ఉత్తమ ప్రదర్శన ఇవ్వండి. ఇదే మహిళల జట్టుకు నా సందేశం. ఎలాంటి ఒత్తిడినీ దరిచేరనీయకండి. బయటి విషయాల గురించి ఏమాత్రం పట్టించుకోకుండా అంతా కలిసికట్టుగా ఉంటే చాలు. మహిళల జట్టు ప్రదర్శనను నేను గమనిస్తున్నాను. ఇప్పటికే వారంతా యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. టోర్నీ ఆరంభానికి ముందు నేను పలువురు మహిళా క్రికెటర్లను కలిశా. ట్రోఫీని భారత్‌కు తీసుకొస్తే గొప్పగా ఉంటుందని చెప్పా’ అని సచిన్ గుర్తు చేసుకున్నాడు.