నిర్మాతలే వీపులు గోకే టైపు, వాళ్లని అని ఏం లాభం: చిరు వ్యాఖ్యలపై స్పందించిన కవిత

ఒకప్పుడు సినీ పరిశ్రమలోని నటీనటులు ఇప్పుడు ఉన్నన్ని సౌకర్యాలు లేవు. ఇప్పుడంటే క్యారవ్యాన్లు వచ్చేసాయి. దాంతో షూటింగ్ దినాలు పెరిగిపోయాయి, నిర్మాతలు కోట్లల్లో ఖర్చుపెడుతున్నారు. ఈ పద్ధతి మార్చుకోవాలని ఇటీవల ‘ఓ పిట్ట కథ’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెగాస్టార్ చిరంజీవి అన్నారు. తాను క్యారవ్యాన్లను కేవలం మేకప్ వేసుకోవడానికి బాత్రూమ్‌కు వెళ్లడానికి మాత్రమే ఉపయోగిస్తానని, అంతేకానీ సీన్ అయిపోగానే అందులోకి వెళ్లిపోవడంలాంటివి చేయనని అన్నారు. దీనిపై సీనియర్ నటి కవిత స్పందిస్తూ షాకింగ్ కామెంట్స్ చేసారు.