అమరావతి: స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ డబ్బు, మద్యం పంపిణీ చేస్తే అడ్డుకోవాలని... ఫొటోలు, వీడియో తీసి పంపాలని నేతలకు చంద్రబాబు నాయుడు సూచించారు. ఎన్టీఆర్ భవన్‌లో కమాండ్ కంట్రోల్ రూమ్, టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఎప్పటికప్పుడు సమాచారాన్ని పంపాలని, మీడియాను సద్వినియోగం చేసుకోవాలని...వెంటనే అధికారులకు ఫిర్యాదులు చేస్తామని తెలిపారు. యువ నాయకత్వం ఎదిగే అవకాశం ఇదే అని పేర్కొన్నారు. స్థానిక నేతలుగా యువతను ప్రోత్సహించాలని నేతలకు చంద్రబాబు పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో చంద్రబాబు పై విధంగా పేర్కొన్నారు.
వైసీపీ డబ్బు పంపిణీ చేస్తే వీడియోలు తీయండి: టీడీపీ అధినేత