ఆరు రాష్ట్రాలకు కేంద్ర హోంమంత్రిత్వశాఖ హెచ్చరిక


న్యూఢిల్లీ : కరోనా వైరస్ భారతదేశంలోనూ వ్యాపిస్తున్న తరుణంలో కేంద్ర హోంమంత్రిత్వశాఖ ఆరు రాష్ట్రాలకు శుక్రవారం హెచ్చరికలు జారీ చేసింది. పశ్చిమబెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, సిక్కిం, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అన్ని రకాల ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని కేంద్రహోంమంత్రిత్వశాఖ రాష్ట్రాలకు సూచించింది. కరోనా వైరస్ బాధితుల సంఖ్య 30కి చేరుకున్న నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలని కోరింది. ఆగ్రా నగరానికి చెందిన ఆరుగురు సభ్యులు గల  కుటుంబం కరోనా బాధితుడితో కలిసి ఉండటంతో వారిని ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కరోనా వైరస్ ప్రబలకుండా అన్ని రకాల ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్థన్ ఆదేశించారు.