విశాఖపట్నం , పవర్ రీడర్ న్యూస్ : పేదలకు అందించేందుకు వీలుగా జిల్లాలో ఇళ్ల స్థలాల సేకరణ పూర్తి చేయడంతో కలెక్టర్ వి.వినయ్ చం దను ముఖ్యమంత్రి ప్రశంసించారు. మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లతో పేదలంద రికీ ఇళ్లు, పంచాయతీ ఎన్నికలు, కరో నా వైరస్ పై అప్రమత్తతపై సీఎం సమీక్షించారు. ఈ సం దర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పేదలందరికీ ఇల్లు పథకంలో అవసరమై న ప్లాట్లను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. స్థల సేకరణ పూర్తయిందని 20 మంది కాంట్రాక్టర్లతో పనులు చేపట్టామని తెలిపారు. జీవీఎంసీ, వీఎంఆర్డీఏ ఇంజనీర్లు నగరంలోని ఇళ్లకు, గ్రామీణ ప్రాంతంలో జిల్లా యంత్రాంగం పనులు పూర్తిచేస్తున్నారన్నారు. వీడియో కాన్ఫరెన్స్ లో జేసీలు ఎల్.శివశంకర్, ఎం.వేణుగోపాలరెడ్డి, ఎస్పీ అట్టాడ బాపూజీ, వీఎంఆర్డీఏ కమిషనర్ కోటేశ్వరరావు, జెడ్పీ సీఈవో నాగార్జున సాగర్, డీపీఆర్వో గోవిందరావు, హౌసింగ్ పీడీ జయరామచారి, జీవీఎంసీ, వీఎంఆర్డీఏ అధికారులు పాల్గొన్నారు. కాగా దివ్యాంగులు, వితంతువులకు వచ్చే నెల 1వ తేదీ మధ్యాహ్నం 2 గంటలలోగా పింఛన్లు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. కలెక్టర్‌కు ముఖ్యమంత్రి ప్రశంసలు
కలెక్టర్‌కు ముఖ్యమంత్రి ప్రశంసలు