కుప్పం: చిత్తూరు జిల్లా కుప్పంలో కరోనా వైరస్ కలవరానికి గురిచేసింది. మల్లనూరు, అడవిబుదుగురు గ్రామాల్లో ఏడుగురికి కరోనా సోకిందనే వదంతులు వ్యాపించాయి. గత నెలలో కాంబోడియా నుంచి ఏడుగురు యువకులు కుప్పంకు చేరుకున్నాయి. దీంతో వారికి కరోనా సోకిందంటూ ప్రచారం జరిగింది. కాగా వారికి వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా లేదని వైద్యులు తేల్చిచెప్పారు. దీంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
కుప్పంలో కరోనా కలవరం