ఇళ్ల పట్టాల పంపిణీపై ఎన్నికల కమిషనర్ ఏమన్నారంటే..


అమరావతి: ఓటర్లను ప్రభావితం చేసే ఏ పథకమైనా కోడ్‌ కిందకే వస్తుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తెలిపారు. ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంపై రమేష్‌కుమార్‌ స్పందించారు. పాతదైనా... కొత్తదైనా ఎన్నికల కోడ్‌కు అనుగుణంగానే ఉండాలని చెప్పారు. అది ఓటర్లను ప్రభావితం చేసేలా ఉండకూడదని రమేష్‌కుమార్‌ సూచించారు.