`ఆచార్య` మరింత వెనక్కి?


మెగాస్టార్ చిరంజీవి, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న `ఆచార్య`ను కష్టాలు వెంటాడుతున్నాయా? ఈ ఏడాదిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం అసాధ్యమేనా?.. అవుననే అంటున్నాయి తెలుగు సినీ పరిశ్రమ వర్గాలు. ఈ సినిమాలో మరో కీలక పాత్రలో నటించబోయే హీరో ఎవరనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. ఇలాంటి సమయంలో సినిమా నుంచి తప్పుకుని హీరోయిన్ త్రిష చిత్రయూనిట్‌కు షాకిచ్చింది.