పదో తరగతి పరీక్షలు వాయిదా వేసుకుంటున్నట్లు బోర్డు అధికారులు చెప్పారని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ వెల్లడించారు. ఈ పరీక్షలను ఎన్నికల ప్రక్రియ అనంతరం ఏప్రిల్‌లో పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారని వివరించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి మౌలిక వసతుల కల్పనకు సైతం పరీక్షల వాయిదా దోహదపడుతుందని చెప్పారు. అధికారులు ఇచ్చిన స్పష్టత కూడా ఎన్నికలు నిర్వహించేందుకు దోహదపడిందన్నారు. తొలుత మార్చి 23 నుంచి ఏప్రిల్ 8వ తేదీ వరకు 10వ తరగతి పరీక్షలు నిర్వహించనున్నట్లు షెడ్యూల్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా, స్థానిక ఎన్నికల ఫలితాల నేపథ్యంలో వాయిదా వేస్తున్నట్లు తెలుస్తోంది.
స్థానిక ఎన్నికల ఎఫెక్ట్.. పదో తరగతి పరీక్షలు వాయిదా