టైమ్స్ స్పోర్ట్స్ అవార్డ్స్.. రేసులో రోహిత్, సింధు

దేశ‌మంతా ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న ద టైమ్స్ ఆఫ్ ఇండియా స్పోర్ట్స్ అవార్డ్స్ (TOISA) వేడుక‌కు రంగం సిద్ధ‌మైంది. గ‌తేడాది క్రీడారంగంలో ప్ర‌తిభ క‌న‌బ‌ర్చిన‌వారికి ఈ అవార్డుల‌ను అందజేయ‌నున్నారు. గురువారం ఢిల్లీలో ఈ కార్య‌క్ర‌మం జ‌రుగ‌నుంది. క్రీడారంగానికి చెందిన అతిర‌థ మ‌హార‌థులు దీనికి హాజ‌రుకానున్నారు. ఈసారి క్రికెటర్ రోహిత్ శ‌ర్మ, బ్యాడ్మింట‌న్ ప్లేయ‌ర్ పీవీ సింధుల‌పై అందరి దృష్టి నెల‌కొని ఉంది.