న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఏటా అందించే ‘నారీ శక్తి’ పురస్కారాన్ని ఈ ఏడాది ఓ 98 ఏళ్ల వృద్ధురాలు కూడా అందుకుంది. మహిళా సాధికారత కోసం కృషి చేసిన వారికి సాధారణంగా ఈ అవార్డు అందిస్తారు. ఈసారి అవార్డు గ్రహీతల్లో కేరళకు చెందిన కర్తియాని అమ్మను కూడా ప్రభుత్వం ఎంపిక చేసింది. ఈ క్రమంలో కర్తియాని అమ్మ.. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా పురస్కారాన్ని అందుకుంది. అనంతరం ఈ అవార్డు గ్రహీతలను ప్రధాని మోదీ కలిశారు. వారితో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా కర్తియాని మాట్లాడుతూ.. తాను ఇటీవలే నాలుగో తరగతి పాసయ్యానని, పరీక్షల్లో 98శాతం మార్కులు సాధించానని చెప్పింది. ఇప్పుడిప్పుడే కొద్దిగా కంప్యూటర్స్ నేర్చుకుంటున్నానని, తనకు ఇంకా చదువుకోవాలని ఉందని పేర్కొంది. 98ఏళ్ల వయసులో చదువుకోవాలనే కలను సాకారం చేసుకుంటున్న కర్తియాని ఎందరికో ఆదర్శంగా నిలిచింది.
98 ఏళ్ల వయసులో నాలుగో క్లాసు పాసై.. ప్రధానితో మీటింగ్