చిరంజీవి లేకపోతే ఆత్మహత్యే గతి.. చెప్పుతో కొట్టి పంపారు.. పృథ్వీరాజ్ షాకింగ్ వ్యాఖ్యలు










మెగాస్టార్ చిరంజీవి లేకపోతే తాను ఈ పాటికి ఆత్మహత్య చేసుకునే వాడినని శ్రీ వెంకటేశ్వర భక్తి చానెల్ (ఎస్వీబీసీ) మాజీ చైర్మన్, సినీ నటుడు పృథ్వీరాజ్ షాకింగ్ కామెంట్ చేశారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో గొప్ప వ్యక్తి చిరంజీవేనని స్పష్టం చేశారు. ఎస్వీబీసీ వివాదం తర్వాత తనకు పృథ్వీ మానసికంగా ఇబ్బంది పడుతున్నాడని, వేషాలు ఇచ్చి ఎంకరేజ్ చేయాలని చెప్పింది ఆయన ఒక్కరే అని ఎమోషనల్ అయ్యారు. ఆయన గాని అండగా లేకపోతే అప్పుడున్న పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకునే వాడినని వ్యాఖ్యానించారు. ఎస్వీబీసీ పదవికి రాజీనామా చేసిన తర్వాత ఆ వివాదంపై, తనపై జరిగిన కుట్రపై గత రెండు మూడు రోజులుగా పృథ్వీ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం రాత్రి ఓ టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పృథ్వీరాజ్ సంచలన విషయాలు వెల్లడించారు. ఎస్వీబీసీ చానల్ మహిళా ఉద్యోగినితో మాట్లాడిన రాసలీలల ఫోన్ కాల్ ఫేక్ అని స్పష్టం చేశారు. మిమిక్రీ చేసి తనను ఇరికించారని వ్యా్ఖ్యానించారు.

ఎస్వీబీసీ వ్యవహారంలో తనను అన్యాయంగా ఇరికించారని పృథ్వీరాజ్ ఆరోపించారు. పోకిరి సినిమాలో రౌడీలు ఇలియానా బట్టలు చింపేసి ఇక నీకు రేప్ అయిపోయిందని చెప్పి వెళ్లిపోతారని.. అలాగే తనపై కూడా అభాండం వేసి వదిలేశారని వాపోయారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని.. తనను ఇందులో ఇరికించిన వారిని వేంకటేశ్వరస్వామే దందిస్తారని చెప్పారు. తనను ఇబ్బంది పెట్టిన వారెవరూ ఇప్పుడు బతికి లేరని, తనను ఇరికించిన వారంతా నాశనమైపోతారని శాపనార్థాలు పెట్టారు. తనపై కుట్ర మొత్తం సొంత పార్టీ వారే చేశారని సంచలన ఆరోపణలు చేశారు. అయినా పార్టీని వదలబోనని స్పష్టం చేశారు.