కరీంనగర్‌లో కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. ఇండోనేసియాకు బృందం కలిసిన వారిలో ఒకరికి కరోనా సోకినట్లు నిర్ధారించారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే కరోనా వైరస్ బారిన పడ్డ ఇండోనేసియా బృందాన్ని హైదరాబాద్‌లోని గాంధీ హాస్పిటల్ తరలించి చికిత్స అందిస్తోన్న సంగతి తెలిసిందే. కరోనా పేషెంట్లను కలిసిన కరీంనగర్ వ్యక్తికి కోవిడ్ పాజిటివ్‌గా తేలడంతో.. స్థానికులు కలవరానికి గురవుతున్నారు. ‘‘ఇటీవల ఇండోనేషియా నుంచి కరీంనగర్ కు వచ్చిన మత ప్రచారకులతో కలిసి సంచరించిన ఒకరికి కరోనా పాజిటివ్ రావడంతో అతడిని గాంధీ ఆసుపత్రికి తరలించాం’’ అని కరీనంగర్ కలెక్టర్ కె.శశాంక తెలిపారు.
ఇండోనేసియన్లను కలిసిన కరీంనగర్ వ్యక్తికి కరోనా.. కలెక్టర్ కీలక ఆదేశాలు