ఎమ్మెల్సీ ఎన్నిక షెడ్యూల్ విడుదల.. ఏప్రిల్ 7న పోలింగ్


నిజామాబాద్‌ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు షెడ్యూల్‌ విడుదలైంది. మార్చి 12న నోటిఫికేషన్‌ జారీ చేయనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) గురువారం (మార్చి 5) ప్రకటించింది. భూపతి రెడ్డిపై అనర్హత వేటు కారణంగా ఈ ఎమ్మెల్సీ స్థానానికి ఖాళీ ఏర్పడిన సంగతి తెలిసిందే. ఏప్రిల్‌ 7న పోలింగ్‌ నిర్వహించనున్నట్లు ఎస్‌ఈసీ. ఆ రోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుంది. ఏప్రిల్‌ 9న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు.


జామాబాద్‌ స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి భూపతి రెడ్డి శాసనమండలికి ఎన్నికయ్యారు. అయితే.. టీఆర్‌ఎస్ తరఫున ఎమ్మెల్సీగా ఎన్నికైన భూపతి రెడ్డి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ ఫిరాయింపునకు పాల్పడ్డారనే ఆరోపణలతో ఎమ్మెల్సీ భూపతి రెడ్డిని అనర్హుడిగా ప్రకటిస్తూ నాటి మండలి ఛైర్మన్‌ స్వామిగౌడ్‌ ప్రకటించారు.
పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ఉల్లంఘించారని.. ఆయణ్ని అనర్హుడిగా ప్రకటించాలని టీఆర్‌ఎస్ శాసనమండలి పక్షం ఛైర్మన్‌కు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న మండలి ఛైర్మన్ వెంటనే చర్యలు తీసుకున్నారు. భూపతి రెడ్డితో పాటు మరో ఇద్దరు ఎమ్మెల్సీలు రాములు నాయక్‌, యాదవరెడ్డిపైనా అనర్హత వేటు వేశారు.



ఎమ్మెల్సీ ఎన్నిక షెడ్యూల్
మార్చి 12న నోటిషికేషన్‌
మార్చి 19వ వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు
మార్చి 20న నామినేషన్లను పరిశీలిలన
ఏప్రిల్‌ 7న పోలింగ్
ఏప్రిల్‌ 9న కౌంటింగ్‌
ఏప్రిల్‌ 13తో ఎన్నికక ప్రక్రియకు ముగింపు