న్యూఢిల్లీ : కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి , రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడైన ముకుల్ వాస్నిక్ 60 ఏళ్ల వయస్సులో వివాహం చేసుకున్నారు. ఆయన చిరకాల మిత్రురాలైన రవీనా ఖురానా అనే ఆమెను ఆయన ఓ హోటల్‌లో సోమవారం వివాహం చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి సోనియా రాజకీయ సలహాదారు, ఎంపీ అహ్మద్ పటేల్, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ హాజరయ్యారు. కాంగ్రెస్ సీనియర్లు ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
60 ఏళ్ల వయస్సులో వివాహమాడిన కాంగ్రెస్ అగ్రనేత