బీజింగ్, న్యూయార్క్: మిలాన్: చైనాలోని ఉహాన్ పట్టణం నుంచి వ్యాప్తి చెందిన కరోనావైరస్ ఇప్పటివరకూ 109 దేశాలకు పాకింది. చైనా తరువాత ఇటలీలో పరిస్థితి దుర్భరంగా మారింది. అమెరికాలోని మిలాన్, మెల్ బోర్న్‌లలో జనం బయటకు రాకూడదనే ఆదేశాలు వెలువడ్డాయి. చైనా, ఇటలీలలో 6 కోట్లకుపై జనం గృహనిర్బంధంలోనే కాలం గడుపుతున్నారు. అమెరికాలో కరోనా వైరస్‌కు సంబంధించి 545 కొత్త కేసులు నమోదుకాగా, ఇప్పటివరకూ 22 మంది మృత్యువాత పడ్డారు. కాలిఫోర్నియా, న్యూయార్క్‌లలో ముందుగా ఎమర్జెన్సీ ప్రకటించారు. మరోవైపు ఇరాన్‌లోనూ ఇటువంటి పరిస్థితే కనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకూ మొత్తం ఒక లక్షా 10 వేల 92 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా భయాల నేపధ్యంలో పర్యాటక ప్రాంతాల్లో సందడి వాతావరణం కనుమరుగయ్యింది.
చైనా, ఇటలీలలో 6 కోట్లకుపై జనం గృహనిర్బంధం