కాసేపట్లో సచివాలయ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం

అమరావతి: మరి కాసేపట్లో సచివాలయ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం జరగనుంది. విశాఖకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని ఈ కమిటీ ఉద్యోగులకు తెలపనున్నట్టు తెలుస్తోంది. మే 31 లోపు సచివాలయం తరలింపునకు ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేయనున్నట్టు సమాచారం. ఆ తర్వాత విద్యాసంవత్సరం ప్రారంభంతో సమస్యలు వస్తాయని.. సచివాలయ ఉద్యోగులు కమిటీకి తెలపనున్నట్టు తెలుస్తోంది.