30 ఏళ్లల్లో ఫస్ట్ టైమ్.. వాహనదారులకు, మోదీ సర్కార్‌కు అదిరిపోయే న్యూస్.. పతనమైన క్రూడ్ ధరలు!


కారు ఉందా? లేదంటే బైక్, స్కూటర్ వంటివి ఉన్నాయా? అయితే మీకు అదిరిపోయే తీపికబురు. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు భారీగా పతనమయ్యాయి. ఏకంగా 25 శాతానికి పైగా పడిపోయాయి. వాహనదారులకు ఇది అదిరిపోయే న్యూస్ అని చెప్పాలి. కేవలం వీరికి మాత్రమే కాకుండా భారత్‌కు ఇది చాలా సానుకూల అంశం.


గ్లోబల్ మార్కెట్‌లో సోమవారం క్రూడ్ ధరలు కుప్పకూలాయి. బ్రెంట్ క్రూడ్ ధర 25.25 శాతం తగ్గుదలతో 33.86 డాలర్లకు దిగొచ్చింది. ఇక డబ్ల్యూటీఐ క్రూడ్ ధర 25.90 శాతం క్షీణతతో 30.62 డాలర్లకు పడిపోయింది. 1991 నుంచి చూస్తే ముడి చమురు ధరలు ఈ స్థాయిలో పతనం కావడం ఇదే తొలిసారి. ఇంట్రాడేలో బ్రెంట్ ఫ్యూచర్స్ ధర ఏకంగా 31 శాతం పతనమైంది.