కరోనా వ్యాప్తిని అరికట్టడంలో భాగంగా హైకోర్టు కూడా అప్రమత్తమైంది. ఇకపై వారానికి మూడు రోజులు మాత్రమే హైకోర్టు పనిచేయాలని తీర్మానించింది. సోమ, బుధ, శుక్రవారాల్లో అదీ అత్యవసరమైన కేసులను మాత్రమే విచారించనుంది. ఒక ద్విసభ్య ధర్మాసనంతోపాటు 4 ఏకసభ్య ధర్మాసనాలు మాత్రమే పని చేస్తాయని వెల్లడించింది. సోమవారం ఉదయం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్.ఎస్.చౌహాన్ నేతృత్వంలో ఫుల్ కోర్టు సమావేశమైంది. హైకోర్టు న్యాయమూర్తులతోపాటు బార్ కౌన్సిల్ ఛైర్మన్ ఎ.నరసింహారెడ్డి, అడ్వొకేట్ జనరల్ బి.ఎస్.ప్రసాద్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు టి.సూర్యకరణ్‌రెడ్డి, ఉస్మానియా వైద్యులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. అంతకుముందు రంగారెడ్డి, నాంపల్లి, కింది కోర్టుల్లోనూ కరోనాపై నివారణ చర్యలు తీసుకునేలా ఆదేశాలివ్వాలంటూ బార్ కౌన్సిల్ ఛైర్మన్ నరసింహారెడ్డి ప్రధాన న్యాయమూర్తికి వినతి పత్రం సమర్పించారు. ఈ నేపథ్యంలో జరిగిన సమావేశంలో తీసుకున్న తీర్మానాలతోపాటు కింది కోర్టులకు ఆదేశాలు జారీ చేస్తూ రిజిస్ట్రార్ జనరల్ ఎ.వెంకటేశ్వర్‌రెడ్డి సర్క్యులర్ జారీ చేశారు.
కీలక అంశాలివి..
* సోమ, మంగళ, బుధవారం మూడురోజులే బెంచ్‌లు పనిచేస్తాయి. వచ్చే వారం 25న ఉగాది సెలవు కావడంతో 23, 26, 27 తేదీలు పనిచేస్తాయి.
* అత్యవసరమైన బెయిలు, స్టేలు, స్టే పొడిగింపువంటివాటితోపాటు కోర్టు జోక్యం చేసుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయన్న అత్యవసర కేసుల విచారణ మాత్రమే ఉంటుంది.

* ఈనెల 17 నుంచి 31లోగా స్టే గడువు తీరే కేసుల వివరాలను న్యాయవాదులు రిజిస్ట్రీ దృష్టికి తీసుకెళ్లాలి. రిజిస్ట్రీ వాటిని ధర్మాసనం ముందు ఉంచితే స్టే పొడిగిస్తూ ఉత్తర్వులిస్తారు. ఈ కేసుల్లో న్యాయవాది, పార్టీలు హాజరుకానవసరంలేదు.
* ఈ కేసులను లిస్ట్‌లో వేయించడానికి కోర్టు ఆవరణలోకి న్యాయవాదిని అనుమతిస్తారు. కేసుల జాబితాలో పేరు లేని న్యాయవాదులు కోర్టు ఆవరణలోకి రావద్దు.
* పిటిషన్ల దాఖలుకు అనుమతి ఉంటుంది. అయితే ఈ కేసులు సంబంధిత ధర్మాసనం ముందు తక్షణం విచారణకు వస్తాయన్న హామీ లేదు. కేసులో అత్యవసరం ఉంటే వాటిని న్యాయవాది చెప్పాలి. దాని ఆధారంగా రిజిస్ట్రార్ (జ్యుడిషియల్), సంబంధిత న్యాయమూర్తి నిర్ణయం తీసుకుంటారు.
* న్యాయవాదులు కోర్టు హాలులో గుంపుగా ప్రవేశించరాదు. ఐదేసి కేసులకు చెందిన న్యాయవాదులు మాత్రమే విడతలవారీగా వెళ్లాలి. మిగిలినవారు బయట కారిడార్‌లో ఉండాలి. న్యాయవాదులు కోర్టులోనికి వచ్చే ముందు శానిటైజర్లతో చేతులు శుభ్రం చేసుకుని రావాలి.
* న్యాయవాది, పార్టీ ఇన్ పర్సన్ విచారణకు హాజరుకాకపోయినా వ్యతిరేక ఉత్తర్వులు వెలువడవు.
* న్యాయమూర్తులతో ఉన్న లా క్లర్కులు తదుపరి ఆదేశాలిచ్చేవరకు హాజరుకానవసరంలేదు.
* బార్ అసోసియేషన్ హాలు, మహిళా న్యాయవాదుల భోజన మందిరం అన్నింటినీ తదుపరి ఉత్తర్వులు ఇచ్చేదాకా మూసివేయాలి.
* హైకోర్టు సిబ్బంది ఈనెల 16 నుంచి బయోమెట్రిక్ ద్వారా హాజరు నమోదుకు మినహాయింపు ఉంటుంది. అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం చేయాలి.