వెంకయ్య చొరవతో ఏపీకి రూ.2498 కోట్లు

 


న్యూఢిల్లీ, మార్చి 7 రైతుల నుంచి సేకరణ, చెల్లింపుల కోసం ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చొరవతో రాష్ట్రానికి కేంద్రం నిధులు విడుదల చేసింది. రాష్ట్రంలో ధాన్యం సేకరణ కోసం ఎఫ్‌సీఐకి కేంద్ర ప్రభుత్వం శుక్రవారం రూ. 2498.89 కోట్లు విడుదల చేసింది. ఏపీలో ధాన్యం సేకరణ, చెల్లింపులపై వార్తాపత్రికల్లో వచ్చిన కథనాలపై వెంకయ్య స్పందించి.. కేంద్ర మంత్రులతో మాట్లాడిన సంగతి తెలిసిందే.