ఏపీలో స్కూల్ విద్యార్థులకు అలర్ట్.. ఈ నెల 15 నుంచి.


ఒంటిపూట బడులు ప్రారంభంకానున్నాయి. మార్చి 15 నుంచి ఏప్రిల్ 23 వరకు ఒంటిపూట బడులు నడుస్తాయని రాష్ట్ర పాఠశాల విద్యా కమిషనర్ వి. చినవీరభద్రుడు తెలిపారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. స్కూళ్లలో విద్యార్థులు, టీచర్లు అనుసరించాల్సిన విధులను పేర్కొంటూ ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు