సరిహద్దుల్లో ఉన్న ఆంధ్రవాళ్ల గురించి ఆలోచించండి

 



చలసాని శ్రీనివాస్‌


విజయవాడ, మార్చి 25  : లాక్‌డౌన్‌ నేపథ్యంలో హైదరాబాద్‌ నుంచి ఆంధ్రా సరిహద్దు చేరుకున్న విద్యార్థుల సమస్యను తక్షణమే పరిష్కరించాలని, దీనిపై ప్రభుత్వం త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర విభజన హామీల సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్‌ ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌లో ఆంధ్రా విద్యార్థులకు కష్టాలు ఎక్కువగా ఉంటాయని, వారు రాష్ట్ర సరిహద్దుకు చేరుకోవటమే గగనమని పేర్కొన్నారు. అటువంటి వారిని సరిహద్దుల్లో నిలువరించటం సరికాదని, శ్రీకాకుళానికి వెళ్లాల్సిన వారు ఎలా వెళ్తారని ప్రశ్నించారు. ఈ విషయంలో వేచి చూసే ధోరణ సరికాదని ఆయన సూచించారు.