విటమిన్‌ బి12తో పురుషులకు ఎలాంటి ఉపయోగాలు ఉంటాయంటే..?


మన శరీరానికి కావల్సిన విటమిన్లలో విటమిన్‌ బి12 కూడా ఒకటి. ఇది ఎర్ర రక్తకణాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే నాడీ మండల వ్యవస్థపై దుష్పరిణామాలు పడకుండా చూస్తుంది. ఇక పురుషుల విషయానికి వస్తే విటమిన్‌ బి12 వారికి పలు ప్రత్యేకమైన ఉపయోగాలను అందిస్తుంది. అవేమిటంటే... 


* విటమిన్‌ బి12 వల్ల పురుషుల్లో వీర్యం వృద్ధి చెందుతుంది. వీర్యం నాణ్యంగా మారుతుంది. వీర్యంలో ఉండే శుక్రకణాలు ఆరోగ్యంగా, చురుగ్గా మారుతాయి. వీర్యం ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. 


* విటమిన్‌ బి12 వల్ల పురుషులు శీఘ్రస్ఖలనం  సమస్య నుంచి బయట పడవచ్చు. శృంగారం ఎక్కువ సేపు చేయగలుగుతారు. 


* విటమిన్‌ బి12 పురుషుల్లో శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది. 


* విటమిన్‌ బి12 ఉన్న ఆహారాలను నిత్యం తీసుకోవడం వల్ల మానసిక సమస్యలు కూడా తగ్గుతాయి. అలాగే కొలెరెక్టాల్‌, లంగ్‌ క్యాన్సర్లు రాకుండా ఉంటాయి. 


నిత్యం 2.4 మైక్రోగ్రాముల విటమిన్‌ బి12 శరీరానికి అందేలా చూసుకుంటే.. పురుషులు పైన చెప్పిన అనారోగ్య సమస్యల నుంచి బయట పడవచ్చు. ఇక విటమిన్‌ బి12 మనకు మటన్‌ లివర్‌, చేపలు, గుడ్లు, రొయ్యు, ఓట్స్‌, చీజ్‌, పాలు తదతర ఆహారాల ద్వారా లభిస్తుంది. వీటిని నిత్యం ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా విటమిన్‌ బి12 లోపం రాకుండా చూసుకోవచ్చు..!